: పునర్విభజన బిల్లును తిరస్కరించిన అసెంబ్లీ


రాష్ట్ర చరిత్రలోనే అత్యంత సంచలనం సృష్టించిన అంశం రాష్ట్ర విభజన. గత కొంత కాలంగా రాష్ట్రం మొత్తం ఈ అంశంపై నిలువునా రెండుగా చీలింది. ఈ నేపథ్యంలో, ఎన్నడూ జరగనంత వాడివేడిగా శాసనసభ సమావేశాలు జరిగాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని వాతావరణం. చర్చలు, గడువు పెంపులు... మరో వైపు ముంచుకొస్తున్న పార్లమెంటు సమావేశాల సమయం. ఈ నేపథ్యంలో, అసెంబ్లీ చివరి రోజున క్షణాల సమయంలో సీన్ మొత్తం మారిపోయింది. రాష్ట్రపతి నుంచి గడువు పెంపుపై సమాచారం కూడా రాకుండానే... సభ వాయిదా అనంతరం స్పీకర్ నాదెండ్ల సీఎం కిరణ్ ఇచ్చిన నోటీసును సభలో ప్రవేశపెట్టడం, క్షణాల్లో మూజువాణి ఓటుతో దాన్ని ఆమోదించడం జరిగిపోయింది. దీంతో ఎన్నో వ్యయప్రయాసల మధ్య సభకు వచ్చిన రాష్ట్ర పునర్విభజన బిల్లు అసెంబ్లీ తిరస్కారానికి గురయినట్టయింది.

  • Loading...

More Telugu News