: జయలలితపై విచారణకు సుప్రీం అనుమతి
1991-94 పన్ను ఎగవేత కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ మేరకు తనకు కేసు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఆమె పెట్టుకున్న పిటిషన్ ను కొట్టివేసింది. ఆమెపై విచారణ కొనసాగించేందుకు ట్రయల్ కోర్టుకు అనుమతించింది. అయితే, విచారణ నాలుగు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది.