: లండన్ లో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం
దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు పెరిగిపోయారు. వారిప్పుడు పార్టీ కార్యకర్తలుగా మారి ఆప్ కు తమదైన సహాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న దక్షిణ లండన్ లోని ఈలింగ్ ప్రాంతంలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయాన్ని తెరిచారు. వారంతా ప్రవాస భారతీయులు కావడం విశేషం. అంతేకాదు, పార్టీ నాయకుడు యోగేంద్ర యాదవ్ తో మూడు గంటల పాటు గూగుల్ ద్వారా హ్యాంగ్ అవుట్ సెషన్ నిర్వహించినట్లు ఏఏపీ యూకె ఓ ప్రకటన విడుదల చేసింది. వీరంతా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.