: గుంటూరు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ మెడికో అదృశ్యం


గుంటూరు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ విద్యార్థిని పుష్పవతి అదృశ్యమైంది. ఆదివారం నుంచి ఆమె ఆచూకీ లభించకపోవడంతో పుష్పవతి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన పుష్పవతి తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు. దీంతో ఆమె బాబాయి దగ్గరే ఉండి చదువుకుంటోంది. గుంటూరులో మెడిసిన్ చదువుతున్న పుష్పవతి ఆదివారం ఇంటి నుంచి ప్రైవేటు బస్సులో బయల్దేరింది.

ఆమెకు సెల్ ఫోన్ లేదు. దీంతో ఆమె ఫోన్ చేస్తుందని ఎదురు చూసిన బాబాయి, పిన్నిలకు నిరాశే ఎదురైంది. దీంతో కళాశాలలో ఆరా తీయగా రిపోర్ట్ చేయలేదని తెలిసింది. దీంతో ఆందోళన చెందిన బాబాయి పాతపట్నం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కిడ్నాపైందా? లేక ఎక్కడికైనా వెళ్లిందా? అసలేం జరిగింది? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News