: మహిళలకు రక్షణ లేదు.. పిల్లలకు పోషకాహారం లేదు: కృష్ణంరాజు
పదేళ్ల కాంగ్రెస్ పాలనలో దేశంలోని మహిళలకు రక్షణ కరవైందని, పిల్లలకు పోషకాహారం అందడం లేదని, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు విమర్శించారు. భీమవరంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీలో తిరిగి చేరడం సొంతింటికి వెళ్లినట్లుగా ఉందని అన్నారు. దేశానికి నాయకత్వం వహించేందుకు నరేంద్ర మోడీ సరైన ప్రత్యామ్నాయం అని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ అదిష్ఠానం ఎక్కడి నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే, అక్కడి నుంచి తాను బరిలో దిగుతానని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజల చేత ఎన్నుకోబడడమే తనకు ఇష్టమని కృష్ణంరాజు తెలిపారు.