: విమాన సర్వీసుల్లో ప్రత్యేక సదుపాయాలు కావాలి: ఎంపీల డిమాండ్


విమానాశ్రయాలలోను, ప్రైవేటు విమానాలలోను తమకు ప్రత్యేక సేవలు అందించాలని పార్లమెంటు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. విమానం ఆలస్యమైతే ముందస్తు సమాచారం ఇవ్వడం, భద్రత తనిఖీలు వేగంగా పూర్తి చేయడం, ప్రత్యేక లాంజ్ తదితర సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. ఈ సర్వీసులు ప్రభుత్వ రంగ విమానాల్లో ఇప్పటికే కల్పిస్తున్నారు. వీటిని ప్రైవేటు సర్వీసులకు కూడా విస్తరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

విమానాశ్రయాల్లో అందర్నీ ఒకేలా చూస్తారు. అది నచ్చని ఎంపీలు తమను ముందు చెక్ చేసి పంపాలని డిమాండ్ చేస్తున్నారు. ముందుగానే వీరికి విమాన సర్వీసు సమాచారం తెలుస్తుండడం వల్ల ఆలస్యంగా వస్తారని, వారిని ముందుగా చెక్ చేసి పంపితే ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తారని భద్రతాధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News