: ఈ దొంగగారి 'రూటే సెపరేటు'!


సాధారణంగా దొంగతనం దేనికి చేస్తారు? ఇదేం ప్రశ్న.. డబ్బు కోసమో, బంగారం కోసమో కదా అంటారా! కరెక్టే కానీ, జపాన్ రాజధాని టోక్యో నగరానికి చెందిన ఈ దొంగగారి రూటే సెపరేటు! అందుకే, ఖరీదైన చెప్పులను మాత్రమే దొంగిలించాలని ఈయన ఆశ పడ్డాడు. అనుకున్నదే తడవుగా, ఓ షోరూమ్ కు కన్నం చేసి, ఎంచక్కా 450 జతల హై హీల్స్ ను కొట్టేశాడు. షా సాటో అనే ఈ దొంగను జపాన్ పోలీసులు తర్వాత పట్టేశారు.

విచారణలో భాగంగా షో సాటో నివాసాన్ని తనిఖీ చేసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. తాను దోచుకున్న చెప్పులన్నింటినీ ఈ ‘షా’ తన గదిలోనే ఉంచాడు. హోస్టెస్ క్లబ్ నుంచి వీటిని తస్కరించాడని జపాన్ పోలీసులు చెప్పారు. సాటోకు ఉద్యోగం లేదని, కనీసం సొంత ఇల్లు కూడా లేదని పోలీసులు తెలిపారు. అందుకనే పాపం.. ‘దొంగ చెప్పు’లన్నిటినీ తన అద్దె గదిలోనే దాచుకున్నాడని కూడా వారు వివరించారు.

  • Loading...

More Telugu News