: మరణశిక్షపై సుప్రీం తీర్పును సవాల్ చేయనున్న కేంద్రం
మరణశిక్ష ఎదుర్కొంటున్న ఖైదీల క్షమాభిక్ష పిటిషన్ పరిష్కరణలో జాప్యం జరిగితే, వారి మరణశిక్షను జీవితఖైదుగా మార్చాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులు, వీరప్పన్ సహచరులు, ఇతరులు కలిపి మొత్తం 15మంది మరణశిక్ష ఖైదీలు దాఖలు చేసుకున్న పిటిషన్లపై విచారణ నేపథ్యంలో కోర్టు తీర్పు వెల్లడించింది. ఇప్పుడీ తీర్పును కేంద్ర ప్రభుత్వం త్వరలో సుప్రీంకోర్టులో సవాల్ చేయనుంది. ఈ మేరకు రివ్యూ పిటిషన్ దాఖలు చేయనుందని సమాచారం.