: హైదరాబాదు, మాదాపూర్ లో ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరి మృతి
రాష్ట్ర రాజధానిలో విషాద ఘటన చోటు చేసుకుంది. మాదాపూర్ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం ఓ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చనిపోయారు. వారిద్దరూ అత్తాకోడళ్లు అని సమాచారం. ఈ ప్రమాద ఘటనలో మరో ముగ్గురు క్షతగాత్రులయ్యారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.