: వైష్ణోదేవి ఆలయ కానుకల్లో.. 43 కిలోల నకిలీ బంగారం


జమ్మూ కాశ్మీర్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వైష్ణోదేవి ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకలలో 43 కిలోల బంగారం, 57 వేల కిలోల వెండి..నకిలీదేనని తేలింది. ఈ విషయం సమాచార హక్కు చట్టం దరఖాస్తు ద్వారా బయటపడింది. గత ఐదేళ్ల కాలంలో మొత్తం 193 కిలోల బంగారం, 81,635 కిలోల వెండిని వైష్ణోదేవి ఆలయంలో భక్తులు సమర్పించారని ఆలయ పాలక మండలి సీఈవో ఎంకే భండారీ వెల్లడించారు. వైష్ణోదేవి ఆలయాన్ని గత ఏడాది సుమారు కోటి మంది వరకు భక్తులు సందర్శించారు.

సాధారణంగా అయితే తాము ఇలా ఇచ్చిన బంగారం, వెండిని ప్రభుత్వానికి పంపుతామని, ఆభరణాలను కరిగించి బంగారం, వెండి నాణేలుగా మార్చి భక్తులకు ఇస్తామని ఆయన తెలిపారు. అయితే భక్తులు కావాలని ఇలా నకిలీ బంగారం వేసి ఉండకపోవచ్చునని, వారు కొనేటప్పుడు నాణ్యత పరీక్షలు చేయించుకోకపోవడమే ఇందుకు కారణం కావచ్చని భండారీ చెప్పారు.

  • Loading...

More Telugu News