: నోబెల్ శాంతి బహుమతికి ఎడ్వర్డ్ స్నోడెన్ నామినేట్
నోబెల్ శాంతి బహుమతికి అమెరికా మాజీ కాంట్రాక్టర్, ఎడ్వర్డ్ స్నోడెన్ నామినేట్ అయ్యాడు. ఈ మేరకు నార్వే నోబెల్ కమిటీ ఓ లేఖలో తెలిపింది. స్నోడెన్ తో పాటు నార్వే చట్టసభ సభ్యుడయిన మరో వ్యక్తి కూడా శాంతి బహుమతికి నామినేషన్ పొందినట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. అమెరికా అంతర్గత వ్యవహారాలను రహస్యంగా తెలుసుకున్న స్నోడెన్ ప్రస్తుతం రష్యాలో ఆశ్రయం పొందుతున్నాడు. పలు దేశాలకు, పౌరులకు వ్యతిరేకంగా అత్యంత ప్రధానమైన నిఘా అంశాలను బయటపెట్టి ఎడ్వర్డ్ ప్రపంచానికి ఎంతో మేలు చేశాడని నార్వే మాజీ మంత్రి బార్డ్ వెగర్ సొల్హెజెల్ మీడియాతో అన్నారు.