: తనిష్క్ షోరూం రెండో దొంగ మీడియా ముందుకు
హైదరాబాద్ పంజాగుట్టలోని తనిష్క్ షోరూంలో కోట్ల విలువ చేసే బంగారం దొపిడీ కేసులో రెండో దొంగను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. గుంటూరు జిల్లాలో అదుపులోకి తీసుకున్న ఆనంద్ నుంచి 72 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తనిష్క్ లో దొంగతనం చేసిన తరువాత బేగంపేటలో ఓ బంగారం దుకాణంలో గాజులు అమ్మేందుకు ప్రయత్నించారని, అయితే షాపు యజమాని గట్టిగా నిలదీయడంతో అక్కడి నుంచి పలాయనం చిత్తగించారని చెప్పారు. కిరణ్ లొంగిపోవడంతో పాటు ఆనంద్ గురించి ఇచ్చిన ఆధారాలను నిర్థారించుకున్న తరువాత బంగారం మొత్తం స్వాధీనం చేసుకుని అతనిని మీడియా ముందు ప్రవేశపెట్టారు.