: అమెరికాలో 'కాకినాడ కుర్రాడి' పరిశోధనలు!


కాకినాడలో పుట్టి.. చిన్నతనంలోనే అమెరికా వెళ్లిన భారతీయ శాస్త్రవేత్త ఖండాంతర ఖ్యాతిని సంపాదించాడు. అతనే.. ముత్తా వంశీ. మైట్రోకాండ్రియా లోపాల గురించి, దాని వల్ల వచ్చే జబ్బుల గురించి ఈ యువ శాస్త్రవేత్త పరిశోదనలు చేస్తున్నాడు. ప్రస్తుతం మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రిలోని హార్వర్డ్ మెడికల్ స్కూల్లో వంశీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. ఆరేళ్ల వయస్సులోనే తల్లిదండ్రులతో కలిసి అమెరికా వెళ్లాడు. తాజాగా భారతదేశ పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డును అందుకున్నాడు. వంశీ కుటుంబ సభ్యులందరూ డాక్టర్లే. అమెరికాలో అనేక అవార్డులు వచ్చినా, ఇతర దేశాల్లో పురస్కారాలు పొందినా, స్వదేశంలో వచ్చిన ‘పద్మశ్రీ’ అవార్డు ఎక్కువ సంతృప్తిని ఇచ్చిందంటున్న వంశీ తన పరిశోధనల గురించి పలు ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

మైటోకాండ్రియా లోపాల వల్ల మూడు ప్రధాన సమస్యలు కలుగుతాయి. వారసత్వం, మనం తినే ఆహారం, మన వాతావారణం ఇలా రకరకాల కారణాల వల్ల ఈ లోపాలు ఏర్పడతాయి. మొదటి రకం లోపాలు జన్యు సంబంధమైనవి. ఇవి వారసత్వంగా సంక్రమిస్తాయి. ఈ లోపాలున్న శిశువులు చిన్నతనంలోనే చనిపోతారు. రెండో రకం లోపాలతో కేన్సర్, మధుమేహం వంటి జబ్బులు వస్తాయి. మూడో రకం లోపాలు వృద్ధాప్యంలో వచ్చే రకరకాల సమస్యలకు కారణం. అంటే, ఒక వ్యక్తి జీవితంలో ప్రతి దశలోనూ మైటోకాండ్రియా కీలక పాత్ర పోషిస్తుంది.

మైటోకాండ్రియా అంటే కణాలకు బ్యాటరీ వంటిది. అదే మన కణాలకు శక్తినిస్తుంది. మైటోకాండ్రియా లేకపోతే కణాలు చనిపోతాయి. మైటోకాండ్రియా పని విధానం గురించి పదేళ్ల నుంచీ పరిశోధన చేస్తున్నామని వంశీ చెప్పారు. మైటోకాండ్రియాలో ఉన్న వెయ్యి భాగాలను ఇప్పటికే గుర్తించామని ఈయన పేర్కొన్నారు. మైటోకాండ్రియాలోని భాగాల్లో కానీ, అనుసంధానంలో గానీ తేడాలొ్స్తే టైప్ 2 మధుమేహం, కేన్సర్ తో పాటు నవజాత శిశువులకు కొన్ని అరుదైన వ్యాధులు వస్తాయని వంశీ చెప్పారు. టైప్ 2 మధుమేహం, కేన్సర్ వచ్చేందుకు గల కారణాలపై కూడా పరిశోధనలు సాగించినట్లు ఆయన చెప్పారు. టైప్ 2 మధుమేహం, కేన్సర్ కు త్వరలోనే మందు కనిపెడతానని ఈ యువ శాస్త్రవేత్త ధీమాగా చెబుతున్నాడు.

  • Loading...

More Telugu News