: మధ్యాహ్నం 2 గంటల వరకు లోక్ సభ వాయిదా
సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఉగ్రవాదులను సమర్ధిస్తున్నారంటూ రెండు రోజుల కిందట కేంద్ర మంత్రి బేణీ ప్రసాద్ వర్మ చేసిన వ్యాఖ్యలు లోక్ సభలో అలజడికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలను ఎస్పీ సభ్యులు సభలో తీవ్రంగా వ్యతిరేకించడంతో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.