: ఎంపీలను వీఐపీలుగా ట్రీట్ చేయండి: ప్రైవేట్ ఎయిర్ లైన్స్ కు డీజీసీఏ ఆదేశం
పార్లమెంటు సభ్యులనందరినీ ఇకనుంచీ వీఐపీలుగానే చూడాలని దేశంలోని అన్ని ప్రైవేటు ఎయిర్ లైన్స్ కు డీజీసీఏ (ఏవియేషన్ ఆఫ్ రెగ్యులేటర్ డైరెక్టోరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక ప్రత్యేక అధికారాల కింద అకస్మాత్తుగా విమానాల రద్దు, భద్రత, ఇమ్మిగ్రేషన్ అనుమతులు, తనిఖీ తదితర విషయాలను ఎంపీలకు ముందుగానే తెలపాలని చెప్పింది. కాగా, దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులు ఎయిర్ లైన్స్ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని సూచించింది. ఈ మేరకు కొంతమంది ఎంపీలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పైవిధంగా డీజీసీఏ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశంలో ఒక్క ఎయిర్ ఇండియా మాత్రమే ఈ మార్గదర్శకాలను అనుసరిస్తోంది.