: రాష్ట్రపతి గారూ! గడువు పెంచొద్దు: తెలంగాణ నేతల లేఖ
రాష్ట్ర పునర్విభజన బిల్లుపై చర్చకు గడువు పెంచవద్దని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తెలంగాణ ప్రాంత మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. బిల్లుపై చర్చించేందుకు ఇప్పటికే వారం గడువు పెంచిన కారణంగా మరోసారి గడువు పెంచాల్సిన అవసరం లేదని వారు లేఖలో పేర్కొన్నారు.