: రాష్ట్రం విడిపోతుందని సీఎంకు బాగా తెలుసు: హరీష్ రావు
రాష్ట్రం విడిపోతుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి బాగా తెలుసని టీఆర్ఎస్ నేత హరీష్ రావు తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ విభజన బిల్లు ఆగదని సీమాంధ్ర నేతలందరికీ తెలుసని, వారు అక్కడి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఊకదంపుడు ఉపన్యాసాలతో ముఖ్యమంత్రి సహా అందరూ సీమాంధ్రులను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. తాము చేస్తున్నది ధర్మ యుద్ధమని హరీష్ రావు అభిప్రాయపడ్డారు.