: దమ్ముంటే ఇదే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టండి: సీఎం సవాల్


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసనసభ వాయిదా అనంతరం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన, దమ్ముంటే ఇదే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టండని సవాల్ చేశారు. దీనిని పార్లమెంటులో పెట్టడానికి అనుమతిస్తే రాజకీయాల నుంచి వైదొలగుతానని చెప్పారు. మరో మూడు వారాల గడువు అడిగింది బిల్లులోని లోపాలను ఎత్తి చూపడానికేనన్న కిరణ్, ఈ సభకు అధికారం లేదంటున్న వాళ్లు ఓటింగుకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. విభజనపై వారి ఉద్దేశం, ప్రాతిపదిక చెప్పకుండా ఈ సభ దేనిపై అభిప్రాయం చెప్పాలన్నారు. అలాంటప్పుడు సభ అభిప్రాయం లేకుండా నేరుగా పార్లమెంటే రాష్ట్ర విభజన చేయవచ్చు కదా? అన్నారు. రాష్ట్ర విభజనకు తాను పూర్తిగా వ్యతిరేకమని, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా తనకు కావాలని స్పష్టం చేశారు. సభలో తను మాట్లాడిన ప్రతి అంశానికి ఓ ప్రాతిపదిక ఉందని చెప్పారు.

  • Loading...

More Telugu News