: లష్కరే ఉగ్రవాది జియావుల్ హక్ కు ఏడేళ్ల జైలుశిక్ష
లష్కరే తాయిబా ఉగ్రవాది జియావుల్ హక్ కు హైదరాబాదులోని ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) ప్రత్యేక కోర్టు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 2010లో పాతబస్తీలోని అతని ఇంట్లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులోనే జియావుల్ కు శిక్ష పడింది.