: అసెంబ్లీలో మాకు భద్రత కల్పించండి: టీజీ
అసెంబ్లీలో తమకు భద్రత కల్పించాలని మంత్రి టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో ఓటింగ్ జరిగితే విధ్వంసానికి దిగే అవకాశం ఉందని అన్నారు. ఓటింగ్ పూర్తయ్యాక తమపై దాడులు జరిగే అవకాశం ఉందని, అందుకే తమకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు. దాడులకు పాల్పడే వారిపై ముందే చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. బిల్లుపై ఏం జరిగినా కేంద్రమే చూసుకుంటుందని బీరాలు పలికిన నేతలంతా, ఓటింగ్ అనే సరికి ఎందుకు భయపడిపోతున్నారో చెప్పాలని ఆయన నిలదీశారు. అసెంబ్లీలో అందరూ అభిప్రాయాలు వ్యక్తం చేయనందున ఓటింగ్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఓటమి భయంతోనే ఓటింగ్ కు ఒప్పుకోవడం లేదని మంత్రి టీజీ ఎద్దేవా చేశారు.