: రాజ్యసభ నామినేషన్ల ఉపసంహరణలో రాజ్యాంగేతర శక్తులు: జేసీ
రాజ్యసభ నామినేషన్ల ఉపసంహరణ వ్యవహరంలో రాజ్యాంగేతర శక్తులు పని చేస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతా ఢిల్లీ నుంచే నడిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. మధ్యాహ్నం మద్దతిచ్చి సాయంత్రం ఉపసంహరించుకున్న ఎమ్మెల్యేలను ఏమనాలని ఆయన ప్రశ్నించారు. స్వతంత్ర అభ్యర్థులకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలకు పీసీసీ చీఫ్ బొత్స హెచ్చరికలు చేసిన నేపథ్యంలో సీమాంధ్ర ఎమ్మెల్యేలు అనూహ్యంగా వెనక్కి తగ్గారు.