: హైదరాబాదులో సమైక్యాంధ్ర న్యాయవాదుల జేఏసీ మహాధర్నా
హైదరాబాదులో సమైక్యాంధ్ర న్యాయవాదుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో మహా ధర్నా చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి రాష్ట్రంలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి భారీగా న్యాయవాదులు తరలివచ్చారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దంటూ వారు కోరారు. తెలుగు వారికి ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే రాష్ట్రం ఉండాలని వారు డిమాండ్ చేశారు.