: అందుబాటులో ఉండండి.. ఏమైనా జరగొచ్చు: టీడీపీ ముఖ్యనేతల హెచ్చరిక


టీడీపీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ ముఖ్యనేతలు హెచ్చరికలు జారీ చేశారు. ఈ రోజు, రేపు శాసనసభలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని, ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఊహించలేమని, ఏ పరిస్థితినైనా ఎదుర్కునేందుకు అందరూ అందుబాటులో అసెంబ్లీ లాబీల్లోనే ఉండాలని సూచిస్తున్నారు. దీంతో నేతల్లో ఏం జరగబోతుందో అనే ఉత్కంఠ ప్రారంభం అయింది. రాష్ట్ర విభజన బిల్లును ఆమోదింపజేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఏదో పాచిక వేసిందని నేతలు అభిప్రాయపడుతున్నారు. సభ వాయిదా పడ్డా బయటకు వెళ్లవద్దని, అందరూ అందుబాటులోనే ఉండాలని వారు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News