: ఎంబీబీఎస్ కోర్సు ఏడాది కుదించాలని యోచిస్తోన్న ఎంసీఐ


ఎంబీబీఎస్ కోర్సును ఒక ఏడాది కుదించాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) యోచిస్తోంది. నాలుగున్నరేళ్లు తరగతి గదిలో చదువు.. మరో ఏడాది ఆస్పత్రిలో శిక్షణ (హౌస్ సర్జన్)...ఇదీ ప్రస్తుత ఎంబీబీఎస్ కోర్సు విధానం. దీనిపై వచ్చే వారం సమావేశమై, కొత్త సిలబస్ కు తుదిరూపునిచ్చి, ప్రభుత్వానికి పంపే అవకాశం ఉందని ఎంసీఐ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత సిలబస్ ప్రకారం సాధారణ వైద్య విద్యకు, మానవ శరీర నిర్మాణ శాస్త్రాన్ని (హ్యూమన్ అనాటమీ) చదివేందుకే వైద్య విద్యార్థులు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది. ఎంబీబీఎస్ తర్వాత స్పెషలైజేషన్ చేసే విద్యార్థులకు వీటివల్ల పెద్దగా ఉపయోగం ఉండటం లేదని ఎంసీఐ వర్గాలు అభిప్రాయపడ్డాయి. కొత్త సిలబస్ దీనికి భిన్నంగా, విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలోనే తగినంత నైపుణ్య శిక్షణనిచ్చేదిగా ఉంటుందని ఎంసీఐ వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News