: ఆ దశ త్వరలోనే ముగిసిపోతుంది: శ్రీశాంత్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ల్లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని జీవితకాల నిషేధానికి గురైన ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్.. తన జీవితంలో చోటుచేసుకున్న దుర్దశ త్వరలోనే ముగిసిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. తానెలాంటి తప్పు చేయలేదన్న శ్రీ, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కొన్ని చెడు సంఘటనలను ఎదుర్కొంటారని అన్నాడు. రెండు రోజుల కిందట భోపాల్ లోని తన బంధువుల వివాహ వార్షికోత్సవం కార్యక్రమానికి హాజరైన భార్య భువనేశ్వరితో కలిసి శ్రీ మీడియాతో మాట్లాడాడు. తొలుత మాట్లాడేందుకు నిరాకరించిన శ్రీశాంత్.. తర్వాత విలేకరులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఇటీవల వివాహం చేసుకున్న తను ప్రస్తుతం సంతోషంగా ఉండంటంపైనే దృష్టి పెట్టినట్లు చెప్పాడు. అయితే, త్వరలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు వెల్లడించాడు.