: శాసనసభ మండలి ప్రారంభం.. గంటపాటు వాయిదా
శాసనమండలి సమావేశాలు ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమైన వెంటనే ఇరు ప్రాంతాలకు చెందిన సభ్యులు చైర్మన్ పోడియంను చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. దీంతో బిల్లుపై చర్చించేందుకు సహకరించాలని మండలి చైర్మన్ చక్రపాణి పలుమార్లు విజ్ఞప్తి చేసినా సభ్యులు పట్టించుకోకపోవడంతో సభను గంటపాటు వాయిదా వేశారు.