: హైదరాబాద్, పాతబస్తీలో రౌడీ షీటర్ దారుణహత్య
హైదరాబాద్, పాతబస్తీలో రౌడీ షీటర్ కరీంఖాన్ దారుణ హత్యకు గురయ్యాడు. గతంలో తమ సన్నిహితుడ్ని హతమార్చాడన్న కారణంతో, ఓ వర్గం సభ్యులు ఈ హత్యకు పాల్పడ్డారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఘటన స్థానికుల్లో కలకలం రేపింది. గత కొద్దిరోజులుగా కరీంను హతమార్చేందుకు ప్రయత్నిస్తున్న దుండగులు, అదును చూసి కత్తులతో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహంపై మొత్తం 20కి పైగా కత్తిపోట్లు ఉన్నట్టు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.