: ముసాయిదా బిల్లుపై ఓటింగ్ జరగాల్సిందే: ధూళిపాళ్ల
ముసాయిదా బిల్లుపై ఓటింగ్ జరగాల్సిందేనని తెలుగుదేశం పార్టీ విప్ ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు. శాసనసభను గంటపాటు వాయిదా వేయడంతో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలోనే నోటీసు ఇచ్చారని స్పీకర్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారని పేర్కొన్నారు. ఓటింగ్ కు పట్టుబడుతూ అవసరమైతే రాత్రి వరకూ శాసనసభలోనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. అన్ని నోటీసులను సభలో ప్రవేశపెట్టాలని ఆయన స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు.