: హైదరాబాదులో ఆరేళ్ల స్కూల్ విద్యార్థి దారుణ హత్య


హైదరాబాదులో ఆరేళ్ల స్కూల్ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. రంగారెడ్డి జిల్లా, నార్సింగిలోని పీరాన్ చెరువు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగులు బాలుడిని పెట్రోలు పోసి తగులబెట్టారు. హత్యకు గురైన బాలుడు గోడేకీఖబర్ ప్రాంతానికి చెందిన యశ్ రాజ్ కుమార్ గా గుర్తించారు. కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో యశ్ రాజ్ ఎల్ కేజీ చదువుతున్నాడు. రెండు రోజుల క్రితమే మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు కూడా నమోదయ్యింది. బంధువులే ఈ దారుణానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News