: గడువిస్తే సరే.. లేకపోతే బిల్లు వెనక్కే!: మంత్రి గంటా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లుపై చర్చకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అడిగినట్టుగా రాష్ట్రపతి గడువు ఇస్తారని భావిస్తున్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ సీఎం కోరినట్టు గడువు ఇవ్వకుంటే బిల్లును తిప్పి పంపిస్తామని చెప్పారు. ఎన్నికలు ముందున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీని రద్దు చేస్తుందని తాను భావించడం లేదని అన్నారు. గతంలో రాష్ట్రాల ఏర్పాటు సందర్భంగా అవసరమైన గడువు ఇచ్చినట్టుగానే ఇప్పుడు కూడా గడువు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన బిల్లుపై ఇప్పటి వరకు 87 మందే మాట్లాడారని, ఇంకా చాలా మంది మాట్లాడాల్సి ఉందని, అందువల్ల గడువు ఇవ్వాల్సిందేనని మంత్రి గంటా స్పష్టం చేశారు.