: టెక్నిక్ సరిదిద్దుకోకపోతే ధావన్ కు ఇబ్బందే: అజారుద్దీన్


భారత యువ ఓపెనర్ శిఖర్ ధావన్ బ్యాటింగ్ శైలిపై అజారుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో ధావన్ ఇబ్బంది పడుతున్నాడని... తన టెక్నిక్ ను సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటాడని చెప్పాడు. ఇంగ్లండ్ లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ధావన్ ఈ బంతులను ఎదుర్కోవడానికి అష్టకష్టాలు పడ్డాడని... కాకపోతే అతను పరుగులు సాధించడంతో విషయం మరుగున పడిపోయిందని అజార్ తెలిపాడు. భారత స్పిన్నర్ అశ్విన్ పై కూడ అజార్ పెదవి విరిచాడు. ఈ రోజు న్యూజిలాండ్ తో జరిగిన వన్డేలో ఒకవైపు జడేజా బంతిని టర్న్ చేస్తుంటే... అశ్విన్ మాత్రం ఫ్లాట్ బంతులనే ఎక్కువగా వేశాడని... ఆఫ్ బ్రేక్ వేయలేకపోయాడని చెప్పాడు.

  • Loading...

More Telugu News