: వరంగల్ నిట్ లో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థులపై సస్పెన్షన్ వేటు
వరంగల్ లోని నిట్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం చెలరేగింది. సీనియర్ విద్యార్థులు తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారని కళాశాలకు చెందిన ఓ జూనియర్ విద్యార్థి అధికారులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే చర్యలు చేపట్టిన వారు.. తొమ్మిది మంది సీనియర్ విద్యార్థులను ఏడాదిపాటు సస్పెండ్ చేశారు. బాధితుడు, నిందితులు కూడా వైజాగ్ కు చెందిన వారని తెలిపారు.