: హ్యాకింగ్ బారిన పూనమ్ పాండే వెబ్ సైట్!
శృంగార తార, నటి పూనమ్ పాండే వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైందట. ఈ మేరకు ఆమె ముంబయిలోని బాంద్రా సైబర్ క్రైమ్ సెల్ కు ఫిర్యాదు చేసింది. అనంతరం మాట్లాడిన పూనమ్, 'నా వెబ్ సైట్ (www.poonampandey.in) ను ఎవరో తెలియని వ్యక్తి హ్యాక్ చేశారని తెలిసి షాక్ అయ్యాను. అతను ఎవరో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అతను నా సైట్ నే ఎందుకు ఎంచుకున్నట్లో అడుగుతాను. సంబంధంలేని జాతీయ విషయాల్లో నన్ను భాగం చేయటం చాలా బాధాకరంగా ఉంది' అని చెప్పింది. ఈ నెల 26న పూనమ్ వెబ్ సైట్ లో పాక్ కు చెందిన ఓ వ్యక్తి 'జస్టిస్ ఇన్ కాశ్మీర్', 'పాకిస్థాన్ జిందాబాద్' అంటూ పోస్ట్ చేశాడు. దాంతో, పాక్ కు చెందిన వ్యక్తే ఈ పని చేసుంటాడని అనుమానిస్తున్నారు.