: బొత్స, జేసీ మధ్య మాటల తూటాలు


ఈ రోజు అసెంబ్లీ ఆవరణలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ను ధిక్కరిస్తున్న జేసీను... ధైర్యముంటే కాంగ్రెస్ పార్టీని విడిచిపోవాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సవాలు విసిరారు. అయితే, తాను పార్టీని వీడనని... 'అవసరమైతే నీవే పార్టీ నుంచి వెళ్లిపో' అంటూ జేసీ తీవ్రంగా ప్రతిస్పందించారు. అంతేకాకుండా, 'టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో నీవు లాలూచీ పడ్డావ'ని జేసీ అన్నారు. తనకు లాలూచీ పడాల్సిన అవసరం లేదని బొత్స ఘాటుగా స్పందించారు. లాలూచీ పడ్డావు కాబట్టే... నలుగురు అభ్యర్థులను నిలబెట్టే అవకాశం ఉన్నా... టీఆర్ఎస్ కోసం ముగ్గురినే నిలబెట్టావని జేసీ మండిపడ్డారు. ఈ సందర్భంగా సహనం కోల్పోయిన జేసీ దివాకర్ రెడ్డి ఓ దశలో బొత్సపై చేయి ఎత్తినట్టు తెలుస్తోంది. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో... పక్కనున్న నేతలు వీరిద్దరినీ చెరోవైపుకు తీసుకెళ్లారు.

  • Loading...

More Telugu News