: సెక్షన్ 377పై కేంద్రం పిటిషన్ తిరస్కరణ
సెక్షన్ 377పై కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. స్వలింగ సంపర్కం చట్ట విరుద్ధమని, దాన్ని ప్రోత్సహిస్తే భారతీయ శిక్షా స్మృతి సెక్షన్ 377(అసహజ నేరాలు) కింద కఠిన శిక్ష విధించాల్సి ఉంటుందని గతేడాది డిసెంబర్ 11న కోర్టు తీర్పు వెల్లడించింది. దానిపై కేంద్రం సహా పలువురు నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.