: శాసనసభ రేపటికి వాయిదా
రెండు వాయిదాల అనంతరం సభ మధ్యాహ్నం ప్రారంభమైంది. సభ ప్రారంభం కాగానే తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకువచ్చి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభాధ్యక్షుడు ఎంత వారించినప్పటికీ వినకపోవడంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.