: నాలుగో వన్డేలో గెలిచిన న్యూజిలాండ్... సిరీస్ ఓడిన భారత్
న్యూజిలాండ్ తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ లో మరో వన్డే మిగిలి ఉండగానే భారత జట్టు సిరీస్ కోల్పోయింది. హామిల్టన్ లో జరిగిన నాలుగో వన్డేలో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. భారత బౌలర్లు ప్రభావం చూపలేక పోవడంతో టీమిండియా న్యూజిలాండ్ ను కట్టడి చేయలేక చేతులెత్తేసింది. దీంతో ఐదు వన్డేల సిరీస్ లో 3-0 తేడాతో సిరీస్ ను న్యూజిలాండ్ జట్టు కైవసం చేసుకుంది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు రోహిత్ శర్మ(79), ధోనీ(79), జడేజా(62), రాయుడు(37) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. అనంతరం 279 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన కివీస్ జట్టు 48 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. రాస్ టేలర్ సెంచరీ చేయగా, మెక్ కల్లం రాణించాడు. దీంతో ఐదు వన్డేల సిరీస్ మరో వన్డే మిగిలి ఉండగానే న్యూజిలాండ్ వశమైంది.