: ఐఏఎస్ అధికారినంటూ 14 లక్షలు వసూలు
ఐఏఎస్ అధికారినంటూ వసూళ్లకు పాల్పడుతున్న ఘరానా మోసగాడికి హైదరాబాద్ పోలీసులు అరదండాలు వేశారు. వెంకట్రామిరెడ్డి అలియాస్ వెంకట్రామారావు తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం కోసం వీఐపీ టికెట్లు ఇస్తానంటూ 14 లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఈ ఉదయం ఒక వ్యక్తికి ఐఏఎస్ నంటూ పరిచయం చేసుకుని, కుచ్చుటోపీ పెట్టేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ ఐఏఎస్ వసూలు చేసిన 14 లక్షల రూపాయల్లో 6 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతనిపై పలు సెక్షన్లపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.