: టీడీపీలోకి దగ్గుబాటికి స్వాగతం.. పర్చూరులో వెలసిన ఫ్లెక్సీలు!
ప్రకాశం జిల్లా పర్చూరులో ఫ్లెక్సీల రగడ నెలకొంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు టీడీపీలోకి స్వాగతం అంటూ పర్చూరులో ఫ్లెక్సీలు వెలిశాయి. వీటిని ఎవరు ఏర్పాటు చేశారో ఎవరికీ అర్థం కావడం లేదు. మరో విషయం ఏమిటంటే, గత అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వీటిని చింపేశారు. ప్రస్తుతం అక్కడ ఈ విషయం సస్పెన్స్ గా మారింది. పర్చూరు నియోజకవర్గానికి ప్రస్తుతం దగ్గుబాటి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.