: షిరిడీ నుంచి తిరిగి వస్తూ మృత్యు కౌగిలిలోకి...
కరీంనగర్ జిల్లా మేడిపల్లి జాతీయ రహదారిపై ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన ఓ కారు రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొంది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా షిరిడీ నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం సంభవించింది. గాయపడిన వారిని జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ బాలుడు, ఓ వృద్ధుడు ఉన్నారు. వీరంతా వరంగల్ జిల్లా భూపాల పల్లికి చెందిన వారు.