: టీడీపీ రాజ్యసభ అభ్యర్ధులుగా గరికపాటి, తోట సీతారామలక్ష్మి ఖరారు


తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్ధులుగా గరికపాటి మోహన్ రావు, తోట సీతారామలక్ష్మిలను పార్టీ ఎంపిక చేసింది. పార్టీకి చేసిన సేవలకు గాను తెలంగాణ ప్రాంతం నుంచి గరికపాటి మోహన్ రావును, సామాజిక సమీకరణాల నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతం నుంచి సీతారామలక్ష్మిలను ఎంపిక చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందనే దానికి నిదర్శనమే తమ రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిక అని చంద్రబాబు పేర్కొన్నారు. రాజ్యసభకు పార్టీ అభ్యర్ధులను ప్రకటించిన సందర్భంగా వారితో కలిసి చంద్రబాబు నిన్న అర్ధరాత్రి విలేకరులతో మాట్లాడారు.

కాగా, మోత్కుపల్లి నర్సింహులు తనకు అభ్యర్ధిత్వం ఇవ్వకపోవడంతో తీవ్రంగా అలిగి, ఒక దశలో ఆయన ఆవేశంగా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించగా, నామా నాగేశ్వరరావు, ఎర్రబెల్లి దయాకరరావు బయటకు వచ్చి ఆయనను లోపలకు తీసుకెళ్ళారు. ఆయనను సముదాయించేందుకు చాలాసేపు ప్రయత్నించారు. మరోవైపు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనను ఎంపిక చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పొలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొన్నా, విడివిడిగా మాట్లాడేందుకు పిలిచినప్పుడు ఆయన వెళ్లకుండా బయటకు వచ్చేశారు. ఇక హరికృష్ణ పోలిట్ బ్యూరో సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే బయటకు వెళ్లిపోయారు. తాను రాజ్యసభ రేసులో ఉన్నానని, పోటీలో ఉండి సమావేశంలో ఉండడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News