: టీడీపీ నుంచి రాజ్యసభకు సీతామహాలక్ష్మి, మోత్కుపల్లి ఖరారేనా?


పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు సీతామహాలక్ష్మిని తక్షణం హైదరాబాద్ రావాలంటూ పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయమై పోలిట్ బ్యూరో సభ్యులందరితో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విడివిడిగా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను హైదరాబాద్ రావాల్సిందిగా పార్టీ కార్యాలయం వర్తమానం పంపింది. దీంతో రాజ్యసభ సీటు దక్కినట్టేనని ఆమె మద్దతుదారులు సంబరపడిపోతున్నారు. సీతామహాలక్ష్మితో పాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన నేత మోత్కుపల్లి అభ్యర్థిత్వం కూడా ఖరారయినట్టు సమాచారం. కాగా, వీరి సీట్ల కేటాయింపును పార్టీ అధికారికంగా దృవీకరించాల్సి ఉంది.

  • Loading...

More Telugu News