: నాకు రాజకీయాలతో సంబంధం లేదు: లతా మంగేష్కర్


రాజకీయ పార్టీలతో తనకు సంబంధం లేదని, అలాగే రాజకీయాలంటే ఆసక్తి కూడా లేదని ప్రముఖ గాయని లతామంగేష్కర్ అన్నారు. లతా మంగేష్కర్ 'యే మేరే వతన్ కే లోగో' పాట పాడి 51 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముంబైలో ఆమెకు సన్మానం చేయనున్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమంలో లతా మంగేష్కర్ ను సన్మానిస్తారు. ఈ సందర్భంగా ఓ టీవీ ఛానెల్ తో ఆమె మాట్లాడుతూ, రాజకీయాలకు, సంగీతానికి సంబంధం లేదని అన్నారు. తాను ఏ పార్టీకీ సంబంధించిన వ్యక్తిని కాదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News