: పొలిట్ బ్యూరో సమావేశం నుంచి మధ్యలోనే వచ్చేసిన హరికృష్ణ!
తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశం నుంచి ఆ పార్టీ సినియర్ నేత నందమూరి హరికృష్ణ మధ్యలోనే బయటికి వచ్చేశారు. రాజ్యసభ ఎన్నికలకు సీటు ఆశిస్తున్న ఆయన, సమావేశంలో ఉండటం సబబు కాదని, పార్టీ అధినేత చంద్రబాబుకి చెప్పి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తీవ్ర మనస్థాపం చెందిన హరికృష్ణ, కొన్ని నెలల కిందట రాజ్యసభకు రాజీనామా చేయడం, వెంటనే అది ఆమోదం పొందటం మనకు తెలిసిందే!