: కమర్షియల్ సినిమాలకు వీణా మాలిక్ గుడ్ బై!


వ్యాపారాత్మక సినీ పరిశ్రమ నుంచి తాను వైదొలగుతున్నట్లు పాకిస్థాన్ శృంగార నటి వీణా మాలిక్ ప్రకటించింది.ఇకనుంచి భారత్, పాక్ లలో కమర్షియల్ చిత్రాలు చేయనని చెప్పింది. భారతీయ సినిమా నిర్మాతల నుంచి అవకాశాలు వస్తున్నప్పటికీ తిరస్కరిస్తున్నానని, కేవలం ఇస్లామిక్ మతానికి సంబంధించిన, సామాజిక సందేశాలను ఇచ్చే చిత్రాలను మాత్రమే చేస్తానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సుందరి వెల్లడించింది. కొన్ని రోజుల కిందట దుబాయ్ కు చెందిన అసద్ బషీర్ ఖాన్ అనే వ్యాపార వేత్తను వీణా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అందుకే, ఆమె అలాంటి సినిమాలు చేయనని చెప్పిందని అంతా అనుకుంటున్నారు.

  • Loading...

More Telugu News