: సీఎంను నిలదీస్తాం: కేటీఆర్


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లును తిప్పి పంపాలన్ని నిర్ణయంపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని నిలదీస్తామని టీఆర్ఎస్ నేత కేటీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ భవన్లో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర కేబినెట్ ఆమోదం లేకుండా బిల్లుపై సీఎం నోటీసు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. బిల్లుపై ఇప్పటికే 87 మంది మాట్లాడారని, ఇంకొంత మంది లిఖిత పూర్వకంగా తమ అభిప్రాయాలు అందజేశారని ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఫిబ్రవరి 1,2 తేదీల్లో ఢిల్లీలో ప్రధానితో సహ జాతీయ పార్టీల నేతలను కలుస్తామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News