: లైంగిక వేదింపుల ఆరోపణలతో టీచర్ పై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆదోని ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. విద్యార్థినులను తరచుగా వేధిస్తున్న విషయం వెలుగులోకి రావటంతో ఆయనను విధుల నుంచి తొలగిస్తున్నట్లు కర్నూలు జిల్లా విద్యాధికారి ప్రకటించారు. హెచ్.ఎమ్. తమతో అనుచితంగా ప్రవర్తిస్తున్నాడంటూ విద్యార్థినులు ఆరోపించారు. ప్రధానోపాధ్యాయుడి ప్రవర్తన బాగోలేదంటూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళా సంఘాల వారు కూడా ఈ ఘటనపై నిరసన వ్యక్తం చేయడంతో చివరకు ఆ కీచక టీచర్ పై వేటు పడింది.