: ఓట్ల కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టొద్దు: జేపీ
ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ... ఓట్లు, అధికారం కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టడం రాజకీయ పార్టీలకు తగదని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ సూచించారు. అన్ని ప్రాంతాలవారు ఆమోదించేలా తెలంగాణ విభజన బిల్లు ఉండాలని... తాము సూచించిన సవరణలను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. ఈ రోజు శాసనసభ వాయిదా పడిన సమయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పంతాలు, పట్టింపులకు పోయి రాష్ట్రాన్ని నాశనం చేయరాదని జేపీ తోటి సభ్యులకు హితబోధ చేశారు. రాష్ట్రం వల్లకాడు అయినా సరే... మేం అధికారంలోకి వస్తే చాలు అని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయని చెప్పారు. ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగించేలా వ్యవహరించరాదని సూచించారు. సీఎం కిరణ్ ఇచ్చిన నోటీసుపై తాను స్పందించనని చెప్పారు.