: పోలీసుల అదుపులో అండమాన్ ప్రమాద పడవ యజమాని
అండమాన్ నికోబార్ దీవుల వద్ద ప్రమాదానికి గురైన పడవ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పడవ యజమానితో పాటు మరో ముగ్గురిని వారు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడంతో పాటు, ప్రయాణికులకు సరిపడా లైఫ్ జాకెట్లు పడవలో ఉంచని కారణంగా 21 మందిని ఆక్వా మెరైన్ అనే పడవ పొట్టన బెట్టుకుంది. 50 మందితో రాస్ ఐలాండ్ కు వెళ్తూ ఆక్వా మెరైన్ నడి సంద్రంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే.