: హైదరాబాద్ రానున్న ఏఐసీసీ ప్రతినిధులు


రాజ్యసభ నామినేషన్ల దృష్ట్యా ఏఐసీసీ కార్యదర్శులు కుంతియా, తిరునావుక్కరసులు హైదరాబాద్ రానున్నారు. వీరి హైదరాబాద్ పర్యటనపై ఆ పార్టీకి చెందిన నేతలు విభిన్న వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లుపై ముఖ్యమంత్రి వేసిన యార్కర్ ను అడ్డుకునేందుకు వారు వస్తున్నారని కొందరు అంటున్నారు. ముఖ్యమంత్రిని ఒప్పించి అసెంబ్లీలో బిల్లును ఆమోదింపజేసేందుకు, తెలంగాణ ప్రాంత నేతలకు కాంగ్రెస్ అధిష్ఠానం చిత్తశుద్ధిని తెలియజేసేందుకు వారు రానున్నారని సీమాంధ్ర నేతలు ఆరోపిస్తున్నారు.

కాగా ఏఐసీసీ కార్యదర్శులు వచ్చి ముఖ్యమంత్రిని ఒప్పించి బిల్లుపై నోటీసు వెనక్కి తీసుకునేలా చేస్తారని కొంతమంది తెలంగాణ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. బిల్లును శాసనసభ, పార్లమెంటుల్లో గెలిపించే బాధ్యత కాంగ్రెస్ భుజానికెత్తుకుందని, అందుకే అధిష్ఠానం వారిని పంపి సీమాంధ్రులకు చెక్ చెప్పి బిల్లును గెలిపిస్తుందని తెలంగాణ నేతలు అంటున్నారు.

  • Loading...

More Telugu News